ASF: దహేగాం మండలం ఇట్యాల గ్రామంలో గిరిజన మహిళ కొత్తపల్లి భారతికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి MLA హరీష్ బాబు సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. వర్షాకాలం ముగిసినందున లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని, బిల్లుల మంజూరు విషయంలో అనుమానాలు అక్కర్లేదని, అందరికీ సకాలంలో బిల్లులు వచ్చే విధంగా చూస్తామని తెలిపారు.