ATP: ప్రభుత్వ డాక్టర్లు విధులకు సరిగా హాజరుకాకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్వో దేవి మంగళవారం హెచ్చరించారు. జిల్లాలో సరిగా విధులకు హాజరుకాని వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామని, తిమ్మంపల్లి, నాగసముద్రం, బొమ్మనహాల్ వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామని తెలిపారు. వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది విధుల్లో లేనియెడల చర్యలు తీసుకుంటామన్నారు.