JN: పాలకుర్తి మండల నూతన ఎంపీడీఓగా వి. వేదవతి బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె అధికారికంగా పదవిని గ్రహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కార్యాచరణ ఉంటుందని తెలిపారు.