SDPT: వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం పురస్కరించుకుని వేద పండితులు విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. విశేష పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, చండీ హోమం, లక్ష పుష్పార్చన జరిగాయి. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్, బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఏర్పాట్లు జరగగా, విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.