GNTR: ఉద్యోగోన్నతి పొందిన ముగ్గురు సబ్-ఇన్స్పెక్టర్లు సోమవారం ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 1992లో కానిస్టేబుల్స్‌గా విధుల్లో చేరిన వివి.రమణా రెడ్డి, బివి.సుధాకర్, ఎన్.మురళీ కృష్ణ ప్రస్తుతం ఎస్సైలుగా పదోన్నతి పొందారు. వారి సర్వీస్ వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ, త్వరలో వారికి పోస్టింగ్‌లు కేటాయిస్తామని తెలిపారు.