సత్యసాయి: అమడగూరు మండలం చినగానిపల్లి పంచాయతీ ఆకులవాండ్లపల్లికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, స్థానిక అభివృద్ధికి ఎమ్మెల్యే సింధూర రెడ్డి కృషికి మెచ్చి టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.