NRPT: అన్ని మతాల సారాంశం ఒక్కటే అని, అందరూ కలిసి మెలసి ఉండాలని ఎంపీ డికే అరుణ అన్నారు. నారాయణపేట మండలం కొల్లంపల్లి హజ్రత్ సయ్యద్ షా అహ్మద్ ఖాతాల్ హుస్సేని దర్గాలో జరిగిన సర్వధర్మ సమ్మేళనంలో పాల్గొన్నారు. సమ్మేళనంలో మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని అన్ని గ్రంథాలు చెబుతున్నాయని చెప్పారు.