ELR: ‘మొంథా’ తుఫాన్ సమయంలో దెబ్బతిన్న విద్యుత్ పనుల పునరుద్దరణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెట్రీ సెల్వి తెలిపారు. 2,000 విద్యుత్ స్తంభాలు, 500 ట్రాన్స్ ఫార్మర్, 1200మంది విద్యుత్ సిబ్బందిని అత్యవసర సేవల నిమిత్తం సిద్ధం చేయడం జరిగిందన్నారు. తుఫాన్ సహాయక చర్యలకు 59 జేసీబీలు, 37 చెట్లు కట్ చేసే యంత్రాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశామన్నారు.