E.G: తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సూరంపాలెం ప్రాజెక్టును ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రాజెక్ట్ ఎస్.ఈ ఏసుబాబు, ఈ.ఈ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నామన్నారు.