KMM: ఖమ్మం నగర ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా ప్రభుత్వం నిధులు కేటాయించింది. సురక్షిత తాగునీటి సరఫరా కోసం రూ. 200 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి తుమ్మల ప్రతిపాదనలతో ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ నిధులతో మున్నేరు, పాలేరు నుంచి నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు రూపొందిస్తారు.