KKD: తుపాను తీవ్రత నేపథ్యంలో యానాం సమీప గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేయనున్నట్లు వర్తక సంఘం ప్రకటించింది. ఈ మేరకు పరిపాలనాధికారి అంకిత్ కుమార్, డీసీటీవో బి. సతీష్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఆహార సామగ్రి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటలోగా కొనుగోలు చేసుకోవాలని వర్తక సంఘం కోరింది.