టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆసీస్తో సిడ్నీ వేదికగా జరిగిన మూడో మ్యాచులో క్యాచ్ పట్టే క్రమంలో శ్రేయస్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ముంబై బ్యాటర్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు. అయితే, మళ్లీ బ్యాట్ పట్టడానికి మూడు నెలల సమయం పట్టొచ్చని సమాచారం.