ELR: దానగుడెంలో గత నెల 5న వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టయిన 10 మంది నిందితుల మొదటి బెయిల్ పిటిషన్ కోర్టు రద్దు చేసింది. అయితే దాదాపు 45 రోజుల తర్వాత నిందితులకు రెండవ పిటిషన్లో బెయిల్ మంజూరైంది.