BDK: ఆళ్లపల్లి మండలం చెల్కగట్టు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం మంగళవారం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కోడు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో పక్క భాగం తగలడంతో సీతానగరంకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.