ATP: రాయదుర్గం పట్టణంలో మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా ఈనెల 28, 29 తేదీల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పురపాలక సంఘం అత్యవసర పరిస్థితులకు ఎదుర్కొనేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు సహాయం కోసం 8555079096 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.