NLG: భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (BRSV) ఆధ్వర్యంలో బుధవారం ‘హలో విద్యార్థి చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ కోరారు. మంగళవారం నల్గొండలో ఆయన మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.