WGL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావులు జూబ్లీహిల్స్లో మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థి అలంకల దీపక్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నమ్మొద్దని ప్రదీప్ రావు అన్నారు.