ATP: మాజీ జడ్పీ ఛైర్మన్, దివంగత దేశాయ్ రెడ్డెప్పరెడ్డి భౌతికకాయాన్ని అనంతపురంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సందర్శించారు. పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెడ్డెప్పరెడ్డి మృతి జిల్లాకు తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.