సత్యసాయి: మొంథా తుఫాన్‌తో అప్రమత్తంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌ను, ఎస్పీ సతీష్ కుమార్‌ను మంత్రి సవిత మంగళవారం ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వైద్య, వ్యవసాయ శాఖ సిబ్బందిని క్షేత్ర స్థాయికి పంపాలని మంత్రి ఫోన్ ద్వారా తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని తుఫాన్ నష్టాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.