KDP: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని బుగ్గ వంక పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ ఉదయం నగరంలో వంక పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ రానున్న మూడు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టుకు నీరు వస్తుందన్నారు. అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు.