కృష్ణా: తుఫాన్ నేపథ్యంలో గుడివాడ విపత్తు స్పందన & అగ్నిమాపక శాఖ ముందస్తు సన్నాహకాలు చేపట్టింది. గుడివాడ అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు నేతృత్వంలో మంగళవారం సన్నాహక కార్యక్రమాలు జరిగాయి. అత్యవసర వేళల్లో వెలుగును అందించే ఆస్కా లైటింగ్ యంత్రాన్ని అధికారులు పరీక్షించారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు.