సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో దొంగ నోట్ల చెలామణి జరుగుతోందని సమాచారం. గ్రామంలోని ఓ బ్రాందీ షాపులో సోమవారం రాత్రి రద్దీగా ఉండే సమయంలో కేటుగాళ్లు మూడు 500 రూపాయల దొంగ నోట్లు చెలామణి చేశారు. ఆ 500 నోట్లు దొంగవని షాపు వారు గ్రహించేలోపే ఆ కేటుగాళ్లు సరుకు తీసుకుని ఉడాయించినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.