NTR: గంపలగూడెం మండలం అనుములంక, కనుమూరు, చిక్కుళ్ళగూడెం వెళ్లే రోడ్డు మార్జిన్లో ప్రమాదకరంగా చెట్లు పెరిగాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మలుపుల వద్ద మరింత ప్రమాదకరంగా చెట్లు ఉన్నాయని ఎదురు వచ్చే వాహనాలను గుర్తించలేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు. కావున సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.