SRCL: ఈనెల 28న సిరిసిల్లలోని మినీ స్టేడియంలో నిర్వహించే కళాకారుల ఎంపికను నవంబర్ 11కు వాయిదా వేస్తున్నట్టు జిల్లా యువజన క్రీడల అధికారి రాందాస్ తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం 8074792123, 7569207411 నంబర్లను సంప్రదించాలన్నారు. ఇవే నంబర్లకు వాట్సప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు.