ఆస్ట్రేలియాతో సిడ్నీ వన్డేలో గాయపడిన క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు బీసీసీఐ అధికారులు వెల్లడించారు. డాక్టర్లు అయ్యర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి బెడ్‌పై ఉన్న అయ్యర్ ఫోటో SMలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.