MDK: తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో దాతల సహాయంతో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సోమవారం రాత్రి ప్రారంభించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవం పురస్కరించుకొని మన ఊరు మన బాధ్యత కార్యక్రమం చేపట్టారు. ప్రజల సహకారంతో నేరరహిత సమాజం తయారవుతుందన్నారు. సీఐ రంగ కృష్ణ, ఎస్సై శివానందం పాల్గొన్నారు.