SRD: సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం సోమవారం లభ్యమైనట్లు సీఐ రమేష్ ప్రకటనలో తెలిపారు. మహిళ వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికైనా మృతురాలి వివరాలు తెలిస్తే 87126 56718, 87125 39107 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.