KNR: కలెక్టర్ పమేలా సత్పతి వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులకు నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర టార్పాలిన్ కవర్లు సిద్ధం చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.