GNTR: ‘మొంథా’ తుఫాన్ హెచ్చరికలను నేపథ్యంలో నగరంలోని ఆంధ్ర ముస్లిం కాలేజీ ప్రాంగణంలో ఈనెల 30న నిర్వహించనున్న జాబ్ మేళా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి కొండా జీవన్రావు ఇవాళ తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు. జాబ్ మేళాకు సంబంధించి త్వరలోనే మరొక తేదీని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.