KMM: గ్రీవెన్స్ కు వచ్చే ఫిర్యాదుదారుడు మరోసారి కార్యాలయానికి రాకుండా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. నగరంలోని కేఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత విభాగాల అధికారులకు అందించి వాటిని పరిష్కరించాలని సూచించారు.