SRCL: వీటీఏడీఏ ఆధర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి, విస్తరణ పనులను జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ క్షేత్ర స్థాయిలో సోమవారం పరిశీలించారు. ఆలయ విస్తరణలో భాగంగా ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు చేపట్టిన కూల్చివేత పనులను ఆలయ, ఆర్&బి అధికారులు ఇంచార్జ్ కలెక్టర్కు క్లుప్తంగా వివరించారు.