NZB: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారు. ఏడంతస్తుల మేడలో 750 పడకలతో నిత్యం 2 వేల వరకు ఓపీ కలిగిన ఆసుపత్రి పాలన వ్యవహరాలంటే ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం పట్టింపు లేదు. దాదాపు దశాబ్ద కాలంగా మెడికల్ కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పాలకమండలి సమావేశాలు జరుగలేదు.