BPT: మార్టూరు మండల వ్యాప్తంగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఇసుక దర్శి గ్రామంలో వర్షపు నీరు నిలువ లేకుండా కాలువల్లో యంత్రాల సహాయంతో పూడికలను తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని మూడు రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులను సమకూర్చుకోవాలని పంచాయతీ అధికారులు సూచించారు.