PLD: ముప్పాళ్ల మండలం మాదలలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలను, రాజుపాలెం మండల కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ వసతి గృహాలను రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత మంగళవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ,సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.