EG: మొంథా తుఫాన్ కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉద్ధృతి మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతోంది. ఇప్పటికే అక్కడ దెబ్బతిన్న కొన్ని గృహాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.