AKP: తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కోటవురట్ల శివారు రామన్నపాలెం గ్రామంలో పైలా రమణమ్మ పెంకుటిల్లు కూలిపోగా, మరొక ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఈ రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మందిని గ్రామంలో కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. విషయాన్ని గ్రామ కార్యదర్శి వీఆర్వోకు తెలియజేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రెండు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.