ప్రకాశం: పామూరు మండలంలోని కోడిగుడ్లపాడు పంచాయతీలోని చెరువుని మంగళవారం పిఓపిఆర్డీ సుందరామయ్య, పంచాయితీ కార్యదర్శి రజనీకాంత్ పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు పూర్తిస్థాయిలో నిండిందని తెలియజేశారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దని తెలియజేశారు.