E.G: మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో 3952.31 హెక్టార్లలో వరి పంటకు పాక్షిక నష్టం వాటిల్లిందని డీఏఓ మాధవరావు మంగళవారం తెలిపారు. ఇందులో 3,569 హెక్టార్లలో పంట నేల వాలగా, 384.29 హెక్టార్లు నీట మునిగింది. రంగంపేటలో 215 హెక్టార్లు నీట మునిగి, 485 హెక్టార్లు నేలకొరిగింది. బిక్కవోలు, నిడదవోలు, అనపర్తి, కడియం సహా పలు మండలాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉందన్నారు.