NRML: భైంసా నుండి మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవాని దేవాలయానికి భవాని భక్తులు పాదయాత్ర మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా భైంసాలో మాత దర్బార్లో లఖన్ భయ్యా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే రామారావు పటేల్, భక్తులు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. సుమారు 300 కిలో మీటర్లు యాత్ర కొనసాగుతుంది.