HYD: ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సర్కిల్ రిపోర్ట్ విడుదలైంది. HYD ఇరిగేషన్ డిపార్ట్మెంట్ CE పరిధిలోని 2599 చెరువులలో 747 చెరువులు పూర్తిగా నిండినట్లుగా అధికారులు నిర్ధారించారు. దాదాపుగా 559 చెరువులు 75 శాతం వరకు నిండినట్లు వెల్లడించారు. ఈ సారి విస్తారంగా వర్షాలు కురవడంతో అనేక చోట్ల చెరువులు నిండినట్లుగా తెలిపారు.