SDPT: పంట వ్యర్థాలను పొలాల్లో కాల్చడం మానుకోవాలని రైతులకు సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణిసూచించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు కోసిన తర్వాత వ్యర్థాలను రైతులు పొలాల్లోనే కాల్చడం వల్ల తీవ్ర వాయు కాలుష్యంకు దారితీస్తుందని తెలిపారు. పంట అవశేషాల దహనం వల్ల వచ్చే పొగకు పర్యావరణం దెబ్బ తింటుందన్నారు.