SKLM: రణస్థలం తహసీల్దార్ కార్యాలయంలో మొంథా తుఫాన్ నేపథ్యంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ అప్పలనాయుడు సోమవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. అనంతరం కంట్రోల్ రూమ్‌ను అకస్మాత్తుగా సందర్శించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తు సమాచారం అందేలా చూడాలని అన్నారు. తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు.