MBNR: కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు సోమవారం రాత్రి స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆలయం నుంచి కళ్యాణకట్ట, దేవరగుట్ట మీదుగా పూలమఠం వరకు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, ఈవో పాల్గొన్నారు.