W.G: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలైన మొగల్తూరు, నరసాపురం మండలాల్లో 10 వేల మంది జనాభాను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. 16 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. భీమవరం డివిజన్‌కు సంబంధించి భీమవరం మండలంలో 3, కాళ్ల, ఆకివీడు, భీమవరంలో 1 చొప్పున పునరావస 6 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.