కరీంనగర్: మద్యం షాపుల లాటరీ డ్రాలో ఓ కుటుంబానికి ఊహించని అదృష్టం వరించింది. జిల్లాకు చెందిన పాక దయానంద్‌కు ఒక షాపు, ఆయన భార్య, కుమార్తెకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం మూడు మద్యం దుకాణాలు దక్కాయి. ఈ అరుదైన ఘటనతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. మద్యం షాపు దక్కాలంటే డబ్బుతో పాటు లక్కు కూడా ఉండాలని డ్రాకు వచ్చిన వారు చర్చించుకున్నారు.