కోనసీమ: ఆత్రేయపురం పల్లపు వీధిలో సోమవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. కాంతం అనే వృద్ధురాలి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టీవీ, విద్యుత్ బోర్డులు కాలిపపోయాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించి, ఇంట్లో కాంతం చిక్కుకున్నారు. వెంటనే చుట్టుపక్కల వారు స్పందించి ఆమెను కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది.