NZB: విధి నిర్వహణలో రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హత్య కుగురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సోమవారం ఎంపీ అర్వింద్, అర్బన్ MLA ధన్ పాల్ సూర్యనారాయణ తమ వంతుగా రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. అదే విధంగా పెద్ద కుమారుడికి ఉచిత విద్యాభ్యాసాన్ని అందజేయాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాన్ని కోరారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.