MLG: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసుల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా పెంకరాయ గ్రామానికి వారు పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడినట్లు ఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తప్పించుకున్నట్లు తెలిపారు.