ఢిల్లీలో టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఏపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలిశారు. ధోనికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం, స్వామి మహిమలను వివరించారు. శ్రీకాళహస్తికి రావాలని, స్వామివారిని దర్శించుకోవాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ధోనిని కలిసిన ఫొటోను ఎమ్మెల్యే తన ‘X’ వేదికగా పోస్టు చేశారు.