ELR: జిల్లాలో టార్పాలిన్లు రైతు సేవా కేంద్రాల్లో ఉంచామని వాటిని రైతులు వాడుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 626 బంకులలో 35,443 లీటర్లు డీజిల్, పెట్రోల్ ఆదనంగా నిల్వలను అందుబాటులో ఉంచామన్నారు. కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. 1,500 మిల్లులను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేశామన్నారు.